అక్షరటుడే, న్యూఢిల్లీ: Amit Shah దేశంలో అశాంతిని రెచ్చగొట్టడమే కాంగ్రెస్ పార్టీ పని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. కేంద్రం ఏం చేసినా దానికి ఏదో ముడిపెట్టి యాగి చేయడమే ప్రతిపక్ష పార్టీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
న్యూఢిల్లీలో జరిగిన రైజింగ్ భారత్ సమ్మిట్లో అమిత్ షా మాట్లాడుతూ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై నిప్పులు చెరిగారు. పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క ముస్లిం వ్యక్తి అయినా పౌరసత్వం కోల్పోయినట్లు నిరూపించగలరా? అని షా రాహుల్ గాంధీకి సవాలు విసిరారు. “ఒక్క ముస్లిం అయినా పౌరసత్వం కోల్పోతే నాకు చెప్పమని నేను రాహుల్ గాంధీకి సవాలు చేస్తున్నాను. ప్రభుత్వం మైనార్టీల హక్కులను లాక్కుంటుందని వారు (కాంగ్రెస్) మొత్తం దేశాన్ని మోసం చేశారు. ఇది హింసకు కూడా దారితీసింది. దీనికి వారే బాధ్యత వహించాలని” అని షా అన్నారు.
Amit Shah : ఓట్ల కోసం నిర్ణయాలుండవు..
కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఓట్ల కోణంలో తీసుకోదని అమిత్ షా స్పష్టం చేశారు. డిసెంబరు 2019లో పార్లమెంటు పౌరసత్వ చట్టాన్ని ఆమోదించిన తర్వాత భారతదేశం అంతటా వెల్లువెత్తిన నిరసనలను ఆయన ప్రస్తావించారు. వక్ఫ్ (సవరణ) బిల్లు ఆమోదం వంటి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముస్లిం ఓటర్లను దూరం చేస్తాయా? అనే ఆందోళనలను అమిత్ షా ప్రస్తావించారు.
“ఓటు కోసం అంతా జరగదు. మనం ఓటు బ్యాంకు రాజకీయాల్లో పాల్గొంటే చాలా ప్రధాన నిర్ణయాలు తీసుకునే వాళ్లం కాదు. సమాజంలోని తప్పులను తొలగించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని ” అని చెప్పారు.