అక్షరటుడే, వెబ్‌డెస్క్: mother-in-law : పది రోజుల్లో కూతురు పెళ్లి పెట్టుకుంది. అంతలోనే పెళ్లి కూతురి(bride) తల్లి(mother)కి చెడు బుద్ధి పుట్టింది. తనకు కాబోయే అల్లుడు, తన కూతురికి కాబోయే భర్తతో కలిసి ఆమె పారిపోయింది. అంతటితో ఆగకుండా పోతూ పోతూ వెంట కూతురు పెళ్లి కోసం దాచిన రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువ చేసే బంగారు నగలతో ఉడాయించింది. కుటుంబ విలువలు, మానవ సంబంధాలను మంట గలిపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని అలీగర్ పరిధి(Aligarh district)లో చోటుచేసుకుంది.
అలీగర్ పరిధి మద్రక్ ప్రాంతంలోని మనోహర్పూర్ కయస్థ అనే గ్రామానికి చెందిన జితేందర్ బతుకుదెరువు కోసం పట్నంలో పనిచేసుకుంటూ అక్కడే ఉండేవాడు. అతని భార్య అప్నా దేవి పిల్లలతో పాటు గ్రామంలోనే ఉండేది. రాహుల్ అనే యువకుడితో వీరి కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. ఏప్రిల్ 16న వివాహం పెట్టుకున్నారు.
ఎంతో సంబంరంగా పెళ్లి పనులు చేసుకుంటున్నారు. శుభలేఖలు కొట్టించారు. డబ్బులు సమకూర్చుకున్నారు. నగలు(jewelry) చేయించారు. ఇలా ఓ వైపు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుంటే.. తెర వెనుక మరో కథ నడుస్తోంది. కాబోయే అల్లుడితో అప్నా దేవి బాగోతం కొనసాగుతోంది. ఇద్దరూ గంటల కొద్దీ కాల్స్ మాట్లాడేవారు.
నిశ్చితార్థాని(engagement)కి, పెళ్లి(wedding)కి సుమారు మూడు నెలల గ్యాప్ ఉండటం వీరికి కలిసి వచ్చింది. సమయం చూసుకుని, అన్నీ సమకూర్చుకుని ఇరువురు జంప్ అయ్యారు. విషయం తెలిసి జితేందర్, పెళ్లి కూతురు, బంధువులు అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు(POLICE).. అత్త, అల్లుడు కోసం వెతుకుతున్నారు.