Riyan Parag : అది ఔటా, నాటౌటా..అంపైర్‌తో ఆ క్రికెట‌ర్ అలా గొడ‌వప‌డ్డాడేంటి?

Riyan Parag : అది ఔటా, నాటౌటా..అంపైర్‌తో ఆ క్రికెట‌ర్ అలా గొడ‌వప‌డ్డాడేంటి?
Riyan Parag : అది ఔటా, నాటౌటా..అంపైర్‌తో ఆ క్రికెట‌ర్ అలా గొడ‌వప‌డ్డాడేంటి?

అక్షరటుడే, వెబ్​డెస్క్​ Riyan Parag : ఐపీఎల్ (IPL 2025) అంటేనే ఎన్నో వివాదాలు, ఎన్నో గొడ‌వ‌లు ఉంటాయి. తాజాగా జ‌రిగిన మ్యాచ్‌లో రియాన్ ప‌రాగ్ (Riyan Parag) ఔట్ వివాదాస్ప‌దంగా మారింది. ఐపీఎల్ 2025 (IPL 2025) సీజ‌న్‌లో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకోవాల‌ని భావించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు (Rajasthan Royals) నిరాశే ఎదురైంది. బుధ‌వారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ 58 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ చ‌తికిల ప‌డింది. అయితే రాజ‌స్థాన్ బ్యాట్స్‌మెన్ రియాన్ ప‌రాగ్ ఔట్ పెద్ద వివాదాస్ప‌దంగా మారంది.

Advertisement

Riyan Parag : ఎలా ఔట్ ఇచ్చారు..

రాజస్థాన్ ఇన్నింగ్స్‌లోని ఏడో ఓవర్‌లో రియాన్ పరాగ్‌ను (Riyan Parag) అంపైర్ అవుట్‌గా ప్రకటించడంతో.. ఈ వివాదాస్పద నిర్ణయం వెలుగులోకి వచ్చింది. సమీక్ష తీసుకున్న తర్వాత కూడా, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చలేదు. కుల్వంత్ ఖేజ్రోలియా వేసిన‌ ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని ప‌రాగ్ థ‌ర్డ్ మ్యాన్ దిశ‌గా షాట్ ఆడాల‌ని అనుకున్నాడు. బంతి వికెట్ కీప‌ర్ చేతుల్లోకి వెళ్లింది. వెంట‌నే గుజ‌రాత్ ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. వెంట‌నే రియాన్ ప‌రాగ్ (Riyan Parag) స‌మీక్ష తీసుకోగా, రిప్లేలో బంతి బ్యాట్‌ను దాటినప్పుడు స్పైక్ ఉందని రీప్లేలు చూపించాయి, అయితే.. అదే సమయంలో బ్యాట్ నేలను తాకింది. థ‌ర్డ్ అంపైర్ సైతం ఔట్ అని చెప్పాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  RCB | ఆర్సీబీకి అదృష్టంగా మారిన గ్రీన్ క‌లర్ జెర్సీ.. ఆ డ్రెస్ వేశారా గెలుపు త‌థ్యం

థ‌ర్డ్ అంపైర్ నిర్ణ‌యంతోనూ సంతృప్తి చెంద‌ని ప‌రాగ్ ఫీల్డ్ అంపైర్‌తో Umpire ఈ విష‌య‌మై కాసేపు చ‌ర్చించాడు. ఆఖ‌రికి చేసేది లేక నిరాశ‌గా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ప్ర‌స్తుతం రియాన్ ప‌రాగ్ ఔట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. కొంద‌రు ప‌రాగ్ ఔట్ అని అంటుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం నాటౌట్ అని చెబుతున్నారు. మొత్తానికి ప‌రాగ్ (Riyan Parag) ఔట్ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 217 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో సాయి సుదర్శ‌న్ (82; 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. జోస్ బ‌ట్ల‌ర్ (36), షారుక్ ఖాన్ (36)లు రాణించారు. భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో రాజ‌స్థాన్ 19.2 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

Advertisement