అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: paddy center | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ్(Bharatiya Kisan Sangh) జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు ఉండట్లేవని..రైతులు అవస్థలు పడుతున్నారన్నారు.
పట్టణంలోని మార్కెట్లో తైబజార్(Taibazar) నిర్వాహకులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి వసతులు లేకున్నప్పటికీ డబ్బులు తీసుకుంటున్నారని మున్సిపల్ కమిషనర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కామారెడ్డి మండలాధ్యక్షుడు కొమిరెడ్డి చిన్న అంజన్న, ప్రధాన కార్యదర్శి భాస్కర్, భైరవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.