అక్షరటుడే, వెబ్‌డెస్క్: అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరత కొనసాగుతోంది. టారిఫ్(Trump Tariff)ల విషయంలో మిగతా ప్రపంచంతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన అమెరికా america.. చైనా(China) విషయంలో మాత్రం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇతర దేశాలపై టారిఫ్‌ల అమలును 90 రోజుల పాటు వాయిదా వేసిన ట్రంప్.. చైనాపై టారిఫ్‌లు కొనసాగిస్తూనే ఫెంటానిల్ పేరిట అదనంగా 20 శాతం సుంకాలను వడ్డించారు.
దీంతో అమెరికాతోపాటు ఆసియా మార్కెట్లలో గురువారం వచ్చిన ర్యాలీ తుడిచిపెట్టుకుపోయింది. యూరోప్ మార్కెట్లు మాత్రం ర్యాలీ తీశాయి. డీఏఎక్స్ 4.34 శాతం, సీఏసీ 3.69 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 2.95 పెరిగాయి. అయితే చైనాపై టారిఫ్‌ల పెంపు ప్రభావం అమెరికా మార్కెట్లపై పడిరది. దీంతో Nasdaq 4.31 శాతం, S&P 3.46 శాతం పడిపోయాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైనా ఉంది. దీంతో జపాన్‌కు చెందిన నిక్కీ 4.41 శాతం నష్టపోయింది.
ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రేయిట్స్ టైవమ్స్ 2.18 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.14 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హంగ్‌సెంగ్ 0.4 శాతం, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.2 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం సుమారు 2 శాతం లాభంతో కొనసాగుతోంది. ఇది మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్‌లో ఓపెన్ అవుతాయని సూచిస్తోంది.
Gift nifty | గమనించాల్సిన అంశాలు
- టారిఫ్‌ల అమలు విషయంలో ట్రంప్(Trump) కాస్త వెనక్కి తగ్గారు. పలు దేశాలపై సుంకాల అమలు నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భారత్ కూడా ఉంది.
- చైనాపై 20 శాతం ఫెంటానిల్(Fentanyl) టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో ఆ దేశంలో యూఎస్ విధించిన టారిఫ్‌లు 145 శాతానికి పెరిగాయి.
- ఎఫ్‌ఐఐ(FII)లు మన మార్కెట్లలో అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. బుధవారం నికరంగా రూ. 4,358 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. కాగా ఇదే సమయంలో డీఐఐ(DII)లు నికరంగా రూ. 2,976 కోట్ల స్టాక్స్ కొనుగోలు చేసి భారీ పతనాన్ని అడ్డుకున్నారు.
- క్రూడ్ ఆయిల్ ధర భారీగా తగ్గింది. 0.7 శాతం తగ్గి బ్యారెల్‌కు 59.65 డాలర్లకు చేరింది.
- డాలర్ ఇండెక్స్ 0.22 శాతం తగ్గి 100.22 వద్ద కదలాడుతోంది.
- రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 42 పైసలు పడిపోయి 86.69 వద్ద ఉంది.