అక్షరటుడే, కామారెడ్డి: ప్రేమ వివాహం చేసుకున్న ఓ కొత్త జంట ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాల వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామానికి చెందిన పెరుమాండ్ల చక్రవర్తి, చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రవళిక ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మొదట అంబేద్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.