అక్షరటుడే, బాన్సువాడ: ఏసీబీ వలలో మరో అధికారి చిక్కారు. బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ సతీష్ ఒకరి నుంచి లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. మధ్యవర్తి సాయంతో రూ.9 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం. బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. గడిచిన నెల రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు.