అక్షరటుడే, వెబ్‌డెస్క్: TCS result | దేశీయ ఐటీ సేవల Domestic IT services దిగ్గజ సంస్థ టీసీఎస్.. 2024-25 ఆర్థిక సంవత్సరం financial year నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. గత త్రైమాసికంతో పోల్చినా, వార్షిక ఫలితాలతో annual results పోల్చినా లాభాలలో క్షీణత కనిపించింది.
టీసీఎస్ జనవరి- మార్చి క్వార్టర్‌లో January-March quarter రూ. 12,284 కోట్ల లాభాలను ఆర్జించింది. కాగా ఇది 2023-24 ఇదే క్వార్టర్‌తో పోల్చితే 1.68 తక్కువ. గత త్రైమాసికం (రూ.12,380 కోట్లు)తో పోల్చినా తక్కువే.. కాగా లాభాలు తగ్గినా రెవెన్యూ(Revenue) మాత్రం పెరిగింది. 2023-24 నాలుగో త్రైమాసికంలో సంస్థ రూ. 61,237 ఆదాయం సంపాదించగా.. ఈసారి 5.3 శాతం పెరిగి రూ. 64,479 కోట్లకు చేరింది. అక్టోబర్ – డిసెంబర్ క్వార్టర్‌లో టీసీఎస్ ఆదాయం రూ.63,973 కోట్లుగా నమోదైంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో financial year టీసీఎస్ TCS రూ. 2,40,893 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.99 శాతం పెరిగి రూ. 2,55,324 కోట్లకు చేరింది. నికర లాభం(Net profit) కూడా రూ. 45,908 కోట్లనుంచి 5.76 శాతం పెరిగి రూ. 48,553 కోట్లకు చేరింది.
అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో టీసీఎస్ వెలువరించిన ఫలితాలు నిరుత్సాహ పరిచినా మేనేజ్‌మెంట్ మాత్రం వృద్ధిపై పాజిటివ్ గైడెన్స్ ఇచ్చింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించామని సంస్థ ఎండీ, సీఈవో అయిన కృతి వాసన్ పేర్కొన్నారు. వరుసగా రెండో క్వార్టర్‌లోనూ second consecutive quarter బలమైన ఆర్డర్ బుక్ సాధించామన్నారు.
టీసీఎస్ తన షేర్ హోల్డర్లకు ఫైనల్ డివిడెండ్(Dividend) ప్రకటించింది. ఒక రూపాయి ఫేస్ వ్యాల్యూగల ఒక్కో షేరుకు రూ. 30 ఫైనల్ డివిడెండ్ ఇవ్వనుంది.
TCS result | 34 మంది బైరేటింగ్(Buy rating)..
టీసీఎస్ లాభాలలో క్షీణత కనిపిస్తున్నా ఎక్కువ మంది అనలిస్టులు బై రేటింగ్ మెయింటెయిన్ చేస్తున్నారు. 48 మంది అనలిస్టుల(Analysts)లో 34 మంది బై రేటింగ్ ఇవ్వగా 11 మంది హోల్డ్ రేటింగ్, ముగ్గురు మాత్రమే సెల్ రేటింగ్ ఇచ్చారు.
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఇచ్చిన రేటింగ్, టార్గెట్ ప్రైస్ వివరాలు..
బ్రోకర్ రేటింగ్ టార్గెట్ ప్రైస్(రూ.లలో)
- యూబీఎస్ Buy 4,250
- సెంట్రమ్ Buy 4,211
- నువామా Buy 4,200
- అంటిక్ Buy 4,150
- గోల్డ్‌మాన్ సాచ్ Buy 3,960
- చాయిస్ Buy 3,950
- కొటక్ Buy 3,800
- జెఫరీస్ Buy 3,400
- నోమురా న్యూట్రల్ 3,890
- సిటీ సెల్ 3,000