అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inter Results | ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు రిజల్ట్స్(Results) కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటర్ ఫలితాలను(Inter results) శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రిలీజ్ చేస్తామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపి ఫలితాలు తెలుసుకోవచ్చని మంత్రి వివరించారు.
Inter Results | తెలంగాణలో ఎప్పుడంటే..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 20 వరకు జరిగాయి. అక్కడ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా చేపట్టి రేపు ఫలితాలు విడుదల చేయనున్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులు(Students) సైతం ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 6 నుంచి 25 వరకు నిర్వహించారు. ఏపీతో పోలీస్తే ఆరు ఐదు రోజులు లేట్‌గా పరీక్షలు ముగిసాయి. అయితే ఫలితాలు విడుదల కానుండగా.. తెలంగాణలో ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నెలాఖరులోగా ఫలితాలు విడుదల చేయొచ్చని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.