అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర చైర్మన్ గా తనను నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తాను స్వీకరించిన పదవికి న్యాయం చేస్తానని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు, గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, కేశవేణు, తదితరులు పాల్గొని మోహన్ రెడ్డిని అభినందించారు.