అక్షరటుడే, కామారెడ్డి: హైవేపై పార్క్ చేసిన వాహనాలే టార్గెట్‌గా మహారాష్ట్ర పార్థీ గ్యాంగ్(Parthi gang) చెలరేగిపోయింది. మారణాయుధాలతో బెదిరించి అందినకాడికి దోచుకుంది. పక్షం రోజుల్లో రెండు చోట్ల దారి దోపిడీకి పాల్పడింది. దీంతో పోలీస్ శాఖ(Police department) సీరియస్‌గా తీసుకుని ముఠాను పట్టుకుంది. కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్ర(Maharashtra) పార్థీ ముఠా సభ్యులు హైవేలపై డేరాలు వేసుకుని నివసిస్తున్నట్లు నమ్మించేవారు. పూసలు, మ్యాట్స్ అమ్మినట్లు నటించి.. హైవేపై పక్కా నిఘా వేసి చీకటి పడగానే మారణాయుధాలతో సంచరిస్తూ.. పార్కింగ్ చేసిన వాహనాలను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడ్డారు. జిల్లాలో వరుస దోపిడీ (robbery) కేసులు నమోదు కాగా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ కేసులను సీరియస్ గా తీసుకున్నారు.
గత నెలలో టేక్రియాల్ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై పార్కింగ్ చేసిన కారులో ఉన్న వాళ్లను మారణాయుధాలతో బెదిరించి ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లారు. ఈ నెలలో సదాశివనగర్ మండలం(Sadashiva nagar mandal) పద్మాజీవాడి ఎక్స్ రోడ్ వద్ద లారీ డ్రైవర్లు భోజనం చేస్తుండగా.. వారిని బెదిరించి సొత్తు ఎత్తుకెళ్లారు. పక్షం రోజుల్లో రెండు ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యి ముఠాను పట్టుకున్నారు.
Parthi Gang | పంక్చర్ షాప్ ఓనర్ ఇచ్చిన క్లూతో..
దారి దోపిడీ ఘటనలకు సంబంధించి ఓ పంక్చర్ షాప్ యజమాని ఇచ్చిన క్లూతో పోలీసులు ఆరు టీంలుగా ఏర్పడి విచారణ జరిపారు. నాలుగైదేళ్లుగా ఈ మహారాష్ట్ర పార్థీ గ్యాంగ్ దారి దోపిడీలకు తెగబడుతున్నట్టుగా గుర్తించారు. మెదక్ జిల్లా చేగుంట వద్ద డేరా వేసుకుని నివసిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు పక్కా ప్లాన్‌తో ముఠా సభ్యులను పట్టుకున్నారు.
Parthi Gang | ఏడుగురి అరెస్ట్: ఎస్పీ రాజేష్ చంద్ర
దారి దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్‌లోని 11 మంది సభ్యుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర(kamareddy Sp Rajesh chandra) తెలిపారు. వీరి నుంచి రెండు మొబైల్స్, ఒక ల్యాప్ టాప్, 4 కత్తులు, 2 కర్రలు, రాళ్లు, టార్చ్ లైట్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్ర వాద్రా జిల్లాకు చెందిన నిందితులు.. కులి కిషన్ పవార్, జాకి గుజ్జు భోస్లే, పవార్ హరీష్, అనురాగ్ రత్నప్ప భోస్లే, అంచనా, హౌరాహ్ పవార్, చుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.