అక్షరటుడే, వెబ్డెస్క్ : Future City | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ(Future City) వరకు మెట్రో(Metro) రైలును విస్తరించనున్నారు. ఈ మేరకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్(RRR), జాతీయ రహదారుల అభివృద్ధి(National Highways)పై ఆయన శుక్రవారం అధికారులతో సమీక్షించారు.
ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరించాలని సీఎం ఆదేశించారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్ RRR works పనులు వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే మెట్రో రెండో దశ పనులకు అనుమతించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే.
కాగా.. రంగారెడ్డి(Rangareddy district) జిల్లాలోని ఏడు మండలాల్లో 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సైబరాబాద్ తరహాలో ఫ్యూచర్ సిటీని ఫోర్త్ సిటీగా అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(FCDA)ని కూడా ఏర్పాటు చేశారు. విమానాశ్రయం, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ ఆర్థిక, పారిశ్రామిక సమూహాలతో అభివృద్ధి చేయనున్నారు. తాజాగా మెట్రోను ఇక్కడి వరకు విస్తరించాలని సీఎం ఆదేశించారు. దీంతో ఆయా గ్రామాల రూపురేఖలు మారనున్నాయి.