Jagtial | కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాలు సహజం

Jagtial | కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాలు సహజం
Jagtial | కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాలు సహజం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagtial | కాంగ్రెస్​ పార్టీ(Congress Party)లో భేదాభిప్రాయాలు ఉండటం సహజమని ప్రభుత్వ విప్​, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ MLA Adluri Laxman Kumar అన్నారు. జగిత్యాల కాంగ్రెస్​లో కొంతకాలంగా వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ బీఆర్​ఎస్(BRS)​ నుంచి గెలిచిన సంజయ్​ హస్తం గూటికి చేరడంతో సీనియర్​ లీడర్​ జీవన్​రెడ్డి(Jeevan Reddy) కొద్దిరోజులుగా పార్టీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు.

Advertisement

ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో విప్​ లక్ష్మణ్​కుమార్​ స్పందించారు. ఎమ్మెల్యే సంజయ్‌, జీవన్‌రెడ్డి మధ్య విభేదాలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు. పరస్పరం వ్యాఖ్యలు చేసుకోవడం సరికాదని ఆయన సూచించారు. అధిష్ఠానం దృష్టికి సమస్యను తీసుకు వెళ్తానన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Job Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు