అక్షరటుడే, వెబ్‌డెస్క్: UPI | నేటి రోజుల్లో యూపీఐ లావాదేవీలకు(UPI transactions) ప్రజలు అలవాటు పడిపోయారు. ప్రతి చిన్న కొనుగోలుకు కూడా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఇవి రెండు నిమిషాలు పనిచేయకపోయినా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
దేశవ్యాప్తంగా యూపీఏ సేవల్లో(UPI Transactions) తీవ్ర అంతరాయం ఏర్పడింది. డిజిటల్ చెల్లింపుల(Digital payments) వ్యవస్థకు ఆటంకం ఏర్పడడం నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి. శనివారం ఉదయం దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచి పోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాంకేతిక లోపం ఏర్పడడంతో చెల్లింపులకు అంతరాయం కలిగించినట్లు చెబుతున్నారు.చెల్లింపులు చేస్తుంటే డబ్బులు వెళ్లడం లేదని చాలా మంది యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం(Paytm) వంటి యాప్స్ పని చేయలేదు.
UPI | ముప్పై రోజుల్లో మూడోసారి..
యూపీఐ సేవలు నిలిచి పోవడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. డబ్బులు ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో ఆందోళన చెందారు. గూగుల్ పే(Google pay), ఫోన్‌పే(Phone pay) వంటి యాప్‌ల్లో ఇబ్బంది తలెత్తడంతో ఇబ్బంది పడ్డారు. అనేక లావాదేవీలు నిలిచిపోయినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యూపీఐ సేవలకు అంతరాయం కలగడం ఇటీవల పెరిగి పోయింది. మార్చి 26న ఇలాగే యూపీఐ సేవలు(UPI Services) నిలిచిపోయాయి. అలాగే, ఏప్రిల్ 2న కూడా సేవల్లో అంతరాయం కలిగింది. సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తలెత్తాయని ఎన్‌పీసీఐ అప్పట్లో వెల్లడించింది. అయితే, తాజాగా శనివారం మరోమారు ఆటంకం కలగడంపై ఇంకా స్పందించలేదు.
యూపీఐ సేవలు(UPI Transactions) నిలిచి పోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్‌బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహింద్రా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులతో సహా విస్తృత శ్రేణి ఆర్థిక సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంతలో, ఈ వారం ప్రారంభంలో, NPCI అంతర్జాతీయ UPI లావాదేవీలకు కీలక విధాన మార్పును ప్రకటించింది. ఏప్రిల్ 8 నాటికి, భారతదేశం వెలుపల చేసే చెల్లింపుల కోసం QR కోడ్‌ల వాడకం ప్రభావితం కాలేదు. అయితే, భారతదేశంలో QR-ఆధారిత చెల్లింపులు ప్రభావితం కాలేదు.