Waqf Act | వక్ఫ్ బిల్లుపై 19న నిరసన: అసదుద్దీన్​ ఒవైసీ

Waqf Act | వక్ఫ్ బిల్లుపై 19న నిరసన : అసదుద్దీన్​ ఒవైసీ
Waqf Act | వక్ఫ్ బిల్లుపై 19న నిరసన : అసదుద్దీన్​ ఒవైసీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Waqf Act | వక్ఫ్​ సవరణ బిల్లు Waqf Amendment Bill చట్ట విరుద్ధంగా ఉందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ Asaduddin Owaisi అన్నారు. ఇటీవల వక్ఫ్​ సవరణ బిల్లును పార్లమెంట్​ ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి కూడా సంతకం చేయడంతో ఆ బిల్లు చట్ట రూపం దాల్చింది.

Advertisement
Advertisement

అయితే ఆ చట్టంపై ముస్లింలు నిరసన తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19న హైదరాబాద్ ​Hyderabadలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఒవైసీ తెలిపారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Tollywood | సినీ పరిశ్రమలు ఏపీకి రావాలి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

వక్ఫ్‌ ఆస్తులను నాశనం చేయడానికే ఈ చట్టం తెచ్చారని ఆయన ఆరోపించారు. ముస్లిమేతరుడిని సభ్యుడిగా ఎలా చేరుస్తారని ఒవైసీ ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా మోదీ(PM Modi government) సర్కార్‌ పనిచేస్తోందన్నారు. వక్ఫ్‌ బిల్లుతో ముస్లింలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై మోదీ మరోసారి ఆలోచించాలని కోరారు.

Advertisement