IRCTC | అంబేడ్కర్​ యాత్రతో విశేషాలు తెలుసుకుందామా..

IRCTC | అంబేడ్కర్​ యాత్రతో విశేషాలు తెలుసుకుందామా..
IRCTC | అంబేడ్కర్​ యాత్రతో విశేషాలు తెలుసుకుందామా..

అక్షరటుడే, వెబ్​డెస్క్: IRCTC | వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు వివిధ ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు. పిల్లలకు సెలవులు holidays ఉండటంతో అలా వెళ్లి సేద తీరాలని భావిస్తారు. వేసవి వేళ రైల్వే మంచి ప్యాకేజీ ప్రకటించింది.

Advertisement

పర్యాటకులకు అనుగుణంగా ఐఆర్​సీటీసీ IRCTC కూడా ప్రత్యేక ప్యాకేజీలు special packages తీసుకు వస్తోంది. ఇందులో భాగంగా అంబేడ్కర్​ యాత్ర Ambedkar Yatra rail విత్​ పాంచ్​ జ్యోతిర్లింగ్​ను five Jyotirlinga ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అంబేడ్కర్​కు సంబంధించిన ప్రాంతాలతో పాటు ఐదు జ్యోతిర్లింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు.

IRCTC | ఏయే ప్రాంతాలు చూడొచ్చంటే..

అంబేడ్కర్​ యాత్ర Ambedkar Yatra జూన్​ 3న ప్రారంభం కానుంది. మొత్తం తొమ్మిది రోజులు పాటు సాగే ఈ యాత్రలో అంబేడ్కర్​తో ముడిపడి ఉన్న నాగ్​పూర్ nagpur junction ​, మౌ Nagpur and Mau ప్రాంతాలను సందర్శించవచ్చు. నాగ్​పూర్​లోని దీక్షభూమి స్థూపం Deekshabhoomi Stupa in Nagpur, శ్రీ స్వామి నారాయణ్​ మందిర్ swami narayana mandir​, ఉజ్జయినిలోని ujjain మహకాళేశ్వరం జ్యోతిర్లంగం Mahakaleshwaram Jyotirlingam, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మౌ ప్రాంతంలోని అంబేడ్కర్​ జన్మభూమి, నాసిక్​లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం nasik trimbakeshwar, పూణేలోని pune భీమశంకర, ఔరంగాబాద్​లోని Aurangabad గ్రిశ్నేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి :  holidays | సెలవు రోజుల్లోనూ మున్సిపల్​ సిబ్బందితో పనిచేయించుకోవడం సరికాదు

IRCTC | టికెటు రేట్లు..

సికింద్రాబాద్​ నుంచి ఈ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ Secunderabad​, కామారెడ్డి Kamareddy, నిజామాబాద్ Nizamabad​, ధర్మాబాద్​, పూర్ణ స్టేషన్​లలో బోర్డిండ్​, డీ బోర్డింగ్​ boarding and de-boarding సౌకర్యం ఉంది. ఈ రైలులో మొత్తం 718 సీట్లు ఉంటాయి. ఎకానమిలో రేట్లు పెద్దలకు రూ.14,700, పిల్లలకు రూ.13,700గా ఉంటుంది. స్టాండర్డ్​లో పెద్దలకు రూ.22,900, పిల్లలకు 21,700, కంఫర్ట్​లో రూ.29,900, పిల్లలకు 28,400గా నిర్ణయించారు.

Advertisement