Apple TV+ | ఇక భారత్​లోనూ ‘యాపిల్​ టీవీ+’ చూడొచ్చు

Apple TV+ | ఇక భారత్​లోనూ ‘యాపిల్​ టీవీ+’ చూడొచ్చు
Apple TV+ | ఇక భారత్​లోనూ ‘యాపిల్​ టీవీ+’ చూడొచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : Apple TV+ | ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్​ దేశాలకే పరిమితమైన యాపిల్​ టీవీ+ (Apple TV+)ను ఇక భారత్​లోనూ వీక్షించవచ్చు. ఈ మేరకు యాపిల్ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది.

Advertisement

సెవెరెన్స్ severence, ది మార్నింగ్ షో the morning show, స్లో హార్సెస్ slow horses మరియు మరెన్నో డ్రామా థ్రిల్లర్‌లతో కూడిన యాపిల్​ టీవీ+ గతంలో భారత్​లో వీక్షించడానికి అందుబాటులో ఉండేది కాదు. ఇటీవల అమెజాన్​ ప్రైమ్​(Amazon Prime) యాపిల్​ టీవీ+తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఇక అమెజాన్​ ప్రైమ్​ యూజర్లు యాడ్​ ఆన్​ సర్వీస్​ ద్వారా యాపిల్ టీవీ+ని వీక్షించవచ్చు. దీని కోసం నెలకు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది.

యాపిల్​ ఆండ్రాయిడ్​ యూజర్ల కోసం ఫిబ్రవరిలో Apple TV యాప్‌ను ప్రవేశపెట్టింది. దీంతో అమెజాన్​ ప్రైమ్​ యాపిల్​తో ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌టెల్ హోమ్ వై-ఫై పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లకు Apple TV+, Apple Music అందించడానికి కంపెనీ ఇటీవలే Airtelతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నెలకు రూ.999తో ప్రారంభమయ్యే ప్లాన్‌లతో హోమ్ వై-ఫై సబ్‌స్క్రైబర్‌లు Apple TV+కి యాక్సెస్‌ను పొందుతారు.

Advertisement