Today gold price | స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు తులం ధర ఎంతంటే..!

Today gold prGold Price | కాస్త ఉపశమనం..స్వల్పంగా తగ్గిన గోల్డ్ce | స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు తులం ధర ఎంతంటే..!
Gold Price | కాస్త ఉపశమనం..స్వల్పంగా తగ్గిన గోల్డ్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | బంగారం ధ‌ర‌లు కొద్ది రోజులుగా ప‌రుగులు పెడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో(Global stock markets) ఒడిదుడుకుల ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి నుంచి బయట ప‌డేందుకు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సదనంగా భావించే బంగారం (Gold)పై ఎక్కువ‌గా పెట్టుబ‌డి పెడుతున్నారు. బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ మార్కెట్లకు ముడిపడి ఉంటాయి. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు రోజు రోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో పసిడి ధ‌ర‌లు(Gold rates) కూడా రికార్డుస్థాయికి చేరుకుంటున్నాయి. గత కొంతకాలం నుంచి నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధరలతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Today gold price | కాస్త త‌గ్గుముఖం..

ఇప్పటికే స్వచ్ఛమైన బంగారం ధర రికార్డు స్థాయిలో 96వేల మార్క్ కు చేరుకోగా, 14 ఏప్రిల్ 2025 సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,690, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.95,660 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,900 లుగా ఉంది. కాగా.. బంగారం పది గ్రాములపై రూ.10 మేర, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. హైదరాబాద్‌లో Hyderabad 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,660 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,660గా ఉంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Today gold price | స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎంతో తెలుసా?

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,840, 24 క్యారెట్ల ధర రూ.95,810 గా ఉంది.ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,660 గా ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,690, 24 క్యారెట్ల రేటు రూ.95,660 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.87,690, 24 క్యారెట్ల ధర రూ.95,660 గా ఉంది. ఇక వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,092,900 కాగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,09,900గా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.99,900 లుగా ఉంది. ముంబైలో రూ.99,900గా ఉంది. బెంగళూరులో Bangalore రూ.99,900 , చెన్నైలో రూ.1,09,900 లుగా ఉంది. రానున్న రోజుల‌లో బంగారం ధ‌ర ల‌కారం ఈజీగా ట‌చ్ చేస్తుంద‌ని అంటున్నారు.

Advertisement