అక్షరటుడే, హైదరాబాద్: SC classification : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రాబోతోంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ సబ్‌కమిటీ భేటీకానుంది. అనంతరం ఎస్సీ వర్గీకరణ జీవోను సబ్ కమిటీ విడుదల చేయనుంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అందించనుంది.
ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించారు. మొత్తం 15 శాతం రిజర్వేషన్లు(reservations) కాగా, మొదటి గ్రూప్‌లో ఉన్నవారికి ఒకశాతం వర్తించనుంది. రెండో గ్రూప్‌లో ఉన్నవారికి 9 శాతం రిజర్వేషన్లు, మూడో గ్రూప్‌లో ఉన్నవారికి 5 శాతం వర్తించేలా ఎస్సీ వర్గీకరణ చేపట్టారు.