Trump tariffs | వాటిపై టారిఫ్‌ల మినహాయింపు.. మనకేంటి ప్రయోజనం?

Trump tariffs | వాటిపై టారిఫ్‌ల మినహాయింపు.. మనకేంటి ప్రయోజనం?
Trump tariffs | వాటిపై టారిఫ్‌ల మినహాయింపు.. మనకేంటి ప్రయోజనం?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Trump tariffs | రెసిప్రోకల్‌ టారిఫ్స్‌(Reciprocal Tariffs) విషయంలో అమెరికా అధ్యక్షుడు రోజుకో రకంగా స్పందిస్తున్నారు. మొదట అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత చాలా దేశాలపై ఆ సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేశారు.

Advertisement

చైనా(China)పై మాత్రం సుంకాలను పెంచుతూ పోయారు. తాజాగా సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్స్‌కు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక‌్షన్‌(US Customs and Border Protection) తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. స్మార్ట్ ఫోన్స్(Smart Phones), టెలికాం ఎక్విప్‌మెంట్, కంప్యూటర్స్, చిప్ మేకింగ్ యంత్రాలు(Chip making machines), రికార్డింగ్ ఎక్విప్‌మెంట్, డాటా ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అసెంబ్లింగ్‌తో పాటు మరికొన్ని రకాల టెక్ ఉత్పత్తులపై రెసిప్రోకల్‌ టారిప్‌ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికా(America)లోని ఆయా వస్తువుల వినియోగదారులతోపాటు వాటిని తయారు చేసే కంపెనీలకు ఊరట లభించినట్లయ్యింది.

Trump tariffs | భారత్‌ పరిస్థితేంటి?

ఫోన్లు, కంప్యూటర్‌ చిప్స్‌(Chips)పై టారిఫ్‌లనుంచి ఉపశమనం నిర్ణయం భారత్‌కు మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది భారత ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి ప్రధానంగా స్మార్ట్‌ఫోన్‌, సెమీకండక్టర్‌ ఎగుమతులకు(semiconductor exports) ఊతం ఇస్తుందని అనలిస్టులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికా చైనా(China)పై 145 శాతం, తైవాన్‌పై 32 శాతం, వియత్నాంపై 46 శాతం రెసిప్రోకల్‌ టారిఫ్‌లు అమలు చేస్తోంది. మనపైన నామమాత్రపు సుంకాలే అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో పోల్చితే తక్కువ ఖర్చుతో భారత్‌నుంచి ఆయా ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉంటాయంటున్నారు. దీంతో యాపిల్‌(Apple), శాంసంగ్‌ (Samsung) వంటి కంపెనీలకు మన దేశం తయారీ కేంద్రంగా మారుతుందంటున్నారు. తద్వారా స్థానికంగా ఉద్యోగాల కల్పన కూడా పెరిగే అవకాశాలుంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం(Current Financial Year)లో మన దేశంలో యాపిల్‌ విస్తరణతో ప్రత్యక్షంగా 2 లక్షలకుపైగా ఉద్యోగాలు, పరోక్షంగా మరో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని ఆశిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Stock market | మిక్స్‌డ్‌గా అంతర్జాతీయ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Trump tariffs | అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే..

టారిఫ్‌ల మినహాయింపుతో మన దేశ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం వృద్ధి చెందుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఐఫోన్‌ ఎగుమతులే 1.2 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌ వార్‌తో విదేశీ పెట్టుబడులు మన దేశంలోకి తరలి వస్తాయని భావిస్తున్నారు.

అలాగే దీర్ఘకాలంలో భారత్‌ గ్లోబల్‌ టెక్‌ హబ్‌(Global Tech Hub)గా మారుతుందంటున్నారు. అయితే అందివచ్చిన అవకాశాలను మన సర్కారు ఎంతవరకు ఉపయోగించుకుంటుందన్న దానిపై వృద్ధి ఆధారపడి ఉంటుంది. మన పాలకులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పీఎస్‌ఐ స్కీమ్‌లు కొనసాగించడం, లాజిస్టిక్స్‌(Logistics) ఖర్చులను తగ్గించడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మొత్తంగా అమెరికా చేస్తున్న టారిఫ్‌ వార్‌లో భారత్‌కు తాత్కాలికంగానైనా మినహాయింపు లభించడం, చైనా, వియత్నాం, తైవాన్‌(Taiwan)లపై రెసిప్రోకల్‌ టారిఫ్‌లు కొనసాగిస్తుండడం మన దేశానికి లాభిస్తుందని, దీర్ఘకాలంలో ఎలక్ట్రానిక్స్‌, సెమీ కండక్టర్‌ రంగాలలో బలమైన పోటీదారుగా మారేందుకు అవకాశాలను కల్పిస్తుందని భావిస్తున్నారు.

Advertisement