అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Salman Khan | బాలీవుడ్(Bollywood) హీరో సల్మాన్ ఖాన్‌కు hero salman khan మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఆయన కారును బాంబుతో పేల్చేస్తామంటూ ఓ అగంతకుడు ముంబై (Mumbai) వర్లీలోని రవాణా శాఖ కార్యాలయానికి ఫోన్ చేశాడు. కాగా సల్మాన్(Salman)ను అంతం చేస్తామని గతంలో బిష్ణోయ్ గ్యాంగ్(Bishnoi gang) ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన సన్నిహితుడు, ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ(Baba Siddhiki)పై కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో పాటు చాలాసార్లు సల్మాన్‌ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ముంబై పోలీసులు ఆయనకు సెక్యూరిటీ పెంచారు. ఈ క్రమంలో మళ్లీ ఆయన కారును పేల్చేస్తామని బెదిరింపులు రావడం గమనార్హం. కాగా ఈ ఫోన్ కాల్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.