PM Modi | వక్ఫ్​ చట్టంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi | వక్ఫ్​ చట్టంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi | వక్ఫ్​ చట్టంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్​ సవరణ బిల్లు Waqf Amendment Billను పార్లమెంట్ Parliament​లో ఆమోదింపజేసి చట్టంగా చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలతో పాటు పలు పార్టీలు ఆందోళనలు చేపడుతున్నాయి.

Advertisement

ఇందులో భాగంగా బెంగాల్ West Bengal​లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారి ఇద్దరు మృతి చెందారు. తాజాగా వక్ఫ్​ చట్టంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. హర్యానా Haryana లోని హిసార్​లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. వక్ఫ్ చట్టంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ Congress వక్ఫ్ నిబంధనలు మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగం కన్నా వక్ఫ్​నే పెద్దది చేసిందని.. తాము ఇప్పుడు దానిని సవరించామన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Waqf Act | వక్ఫ్ బిల్లుపై 19న నిరసన: అసదుద్దీన్​ ఒవైసీ

PM Modi | కనెక్టివిటీ పెంచుతున్నాం

దేశంలో 2014కు ముందు దేశంలో 74 ఎయిర్ పోర్టులు (Airports) ఉంటే, ఈరోజు 150 ఎయిర్ పోర్టులు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 70 ఏళ్లలో 74 ఎయిర్ పోర్టులు మాత్రమే నిర్మించారన్నారు. తాము అధికారంలోని వచ్చాక కనెక్టవిటీ airport connectivity పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా 76 విమానాశ్రయాలు నిర్మించామని తెలిపారు. పేదలకు సామాజిక న్యాయం (Social Justice) అందించడానికి తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

Advertisement