అక్షరటుడే, వెబ్‌డెస్క్:Samsung | ప్రముఖ కంపెనీ శాంసంగ్(Samsung) ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ని పరిచయం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల శాంసంగ్‌లో ఫోల్డబుల్ మోడల్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అమెజాన్ Amazon ఇండియాలో భారీ తగ్గింపుతో గెలాక్సీ Z ఫోల్డ్ 6 పొందవచ్చు. ప్రస్తుత జనరేషన్ ఫోల్డబుల్ ధర రూ.35వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ(Samsung Galaxy) Z ఫోల్డ్ 6 రూ.1,64,999 ప్రారంభ ధరకు లాంచ్ కాగా అమెజాన్‌లో రూ.1,31,473కి జాబితా అయింది. ఏకంగా రూ.33,526 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. HDFC బ్యాంక్, బ్యాంక్ కార్డులపై అదనంగా రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది.
Samsung | భారీ డిస్కౌంట్‌తో..
హెచ్‌డీఎఫ్‌సీ ఈఎంఐ ఆఫర్ : ఈఎంఐ EMI లావాదేవీలపై రూ. 3,250 అదనపు డిస్కౌంట్ ఉంటుంది. అలానే ఈఎంఐ ప్లాన్(EMI Plans)లు నెలకు రూ. 6,374 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అలానే ఎక్స్ఛేంజ్ ఆఫర్ : పాత ఫోన్లపై రూ. 22,800 వరకు డిస్కౌంట్ (మోడల్, కండిషన్ ఆధారంగా) ఉంటుంది. మొత్తం ప్రొటెక్షన్ ప్లాన్ : యాడ్-ఆన్ రూ. 8,999కు లభిస్తుంది. ఇందులో నేవీ, సిల్వర్ షాడో కలర్(Silver shadow color) ఆప్షన్లలో వస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 టాప్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు చూస్తే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్, ఫోల్డబుల్ టెక్నాలజీని అందిస్తుంది.ప్రైమరీ డిస్‌ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో 7.6-అంగుళాల QXGA+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది.
కవర్ డిస్‌ప్లే : 6.3-అంగుళాల HD+ డైనమిక్ అమోల్డ్ 2X స్క్రీన్, ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ద్వారా రే ట్రేసింగ్ సపోర్టు, మెమరీ : 12GB ర్యామ్, 1TB స్టోరేజీ వరకు ఉంటుంది. బ్యాటరీ : 4,400mAh, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ : గెలాక్సీ ఏఐ ఫీచర్లు, డిజైన్, ఆండ్రాయిడ్ Android 15 ఆధారిత వన్ UI 7పై రన్ అవుతుంది. ట్రిపుల్ బ్యాక్ కెమెరా, OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. కవర్ స్క్రీన్‌పై 10MP సెల్ఫీ కెమెరా, ప్రైమరీ స్క్రీన్‌పై 4MP అండర్-డిస్‌ప్లే కెమెరా ఉంటుంది. ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే.. గెలాక్సీ Z ఫోల్డ్ 7 రాకముందే ఈ మోడల్ ని అమెజాన్‌లో అతి తక్కువ ధరకే పొందవచ్చు.