Russian missile | భారత ఫార్మా కంపెనీ గిడ్డంగిపైకి రష్యా క్షిపణి

Russian missile | భారత ఫార్మ కంపెనీ గిడ్డంగిపైకి రష్యా క్షిపణి
Russian missile | భారత ఫార్మ కంపెనీ గిడ్డంగిపైకి రష్యా క్షిపణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Russian missile | ఉక్రయిన్​పైకి Ukraine రష్యా Russia ప్రయోగించిన ఓ క్షిపణి భారత ఫార్మ కంపెనీకి Indian pharma company చెందిన గిడ్డంగిపై పడింది. ఉక్రెయిన్​లోని భారత ఔషధ సంస్థ కుసుమ్కు చెందిన గిడ్డంగిపైకి రష్యా Russia క్షిపణి ప్రయోగించిందని ఇండియాలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం తెలిపింది. భారత్ India తమకు చిరకాల మిత్రదేశమని చెప్పుకునే రష్యా Russia ఉద్దేశ్యపూర్వకంగానే భారతీయ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నదని పేర్కొంది. పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులను నాశనం చేస్తోందని ఆరోపించింది. “ఈ ఉదయం రష్యన్ డ్రోన్లు Russian drones కీవ్లోని ఒక ప్రధాన ఔషధ గిడ్డంగిని పూర్తిగా ధ్వంసం చేశాయి. వృద్ధులు, పిల్లలకు అవసరమైన మందుల నిల్వలను తగలబెట్టాయి. ఉక్రేనియన్ పౌరులపై రష్యా దాడులు కొనసాగుతున్నాయని” తెలిపింది.

Advertisement

తూర్పు ఉక్రెయిన్లోని eastern Ukraine రష్యన్ మాట్లాడే ప్రాంతాలను రక్షించడంతో పాటు నాటోలో ఉక్రెయిన్ను Ukraine in NATO చేర్చుకోవద్దని పేర్కొంటూ రష్యా 2022 ఫిబ్రవరి నుంచి దాడులను ప్రారంభించింది. ప్రత్యేక సైనిక చర్యగా ప్రారంభించిన ఈ యుద్ధం మూడేళ్లు దాటిపోయినా కొలిక్కి రాలేదు. రెండు దేశాలు భీకర దాడులకు fierce attacks పాల్పడుతుండడంతో ఇరువైపులా లక్షలాది మంది చనిపోయారు. కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా US President రెండోసారి అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ Donald Trump ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత నెలలో ఇరుపక్షాలు సూత్రప్రాయంగా 30 రోజుల సమ్మె విరమణకు అంగీకరించినప్పటికీ, సౌదీ అరేబియాలో అమెరికా అధికారులతో విడివిడిగా చర్చల తర్వాత గందరగోళం త్వరగా తలెత్తింది. ఆ తర్వాత అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ పరస్పర దాడులు చేసుకుంటున్నాయి.

Advertisement