అక్షరటుడే, వెబ్‌డెస్క్: stock market | రెసిప్రోకల్ టారిఫ్(Receprocal tariff)ల అమలు విషయంలో అమెరికా చాలా దేశాలకు తాత్కాలిక మినహాయింపు ఇవ్వడాన్ని స్టాక్ మార్కెట్లు stock markets పాజిటివ్‌గా తీసుకున్నాయి. సుంకాల అమలును 90 రోజులపాటు వాయిదా వేయడంతో రయ్యిరయ్యిమంటూ పైపైకి దూసుకువెళ్తున్నాయి. అమెరికా(America), ఆసియాలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలు (Stock exchanges) అన్నీ లాభాలతో కొనసాగుతున్నాయి. యూఎస్(US)కు చెందిన మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. నాస్డాక్(Nasdaq) 2.06 శాతం, ఎస్అండ్పీ(S&P) 1.81 శాతం పెరిగాయి. డౌజోన్స్ ఫ్యూచర్స్ సోమవారం ఒక శాతం లాభంతో కొనసాగుతోంది.
stock market | ఆసియా మార్కెట్లలోనూ జోరు..
ఆసియా స్టాక్ మార్కెట్లు(Asia stock markets) కూడా జోరును కొనసాగిస్తున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హంగ్‌సెంగ్(Hang Seng) 2.35 శాతం లాభంతో ముగియగా జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.17 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.94 శాతం, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.75 శాతం పెరిగాయి. ఇండోనేషియాకు చెందిన జకార్తా కాంపోజిట్ 2.22 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రేయిట్స్ టైమ్స్(Straits Times) 1.15 శాతం లాభంతో కొనసాగుతుండగా తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాత్రమే స్వల్ప నష్టాలతో ముగిసింది.
stock market | యూరోప్ మార్కెట్లూ పాజిటివ్‌గానే..
యూరోప్(Europe)కు చెందిన ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలూ పాజిటివ్‌గానే స్పందిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రధాన ఇండెక్స్(Indices)లు లాభాలతో ఉన్నాయి. డీఏఎక్స్ 2.50 శాతం లాభంతో ఉండగా సీఏసీ 2.17 శాతం, ఎఫ్టీఎస్ఈ(FTSE) 1.88 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
stock market | మన మార్కెట్లకు సెలవు
అంబేడ్కర్ జయంతి సందర్భంగా మన మార్కెట్లకు సెలవు. దీంతో సోమవారం ట్రేడింగ్ trading జరగడం లేదు. కాగా గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty)లో మాత్రం ట్రేడింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 1.65 శాతం లాభంతో కదలాడుతోంది.