అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aghori Lady Cheating : గత కొంత కాలంగా లేడీ అఘోరీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ యువతిని ఎత్తుకెళ్లిన ఘటనతో అఘోరీ వార్తల్లోకి ఎక్కింది. తాజాగా మరో భారీ మోసం వెలుగు చూసింది.
ఓ పూజ చేస్తానని నమ్మించి లేడీ ప్రొడ్యూసర్ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసింది. మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయగా, బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సైబరాబాద్ మొకిలా పోలీస్ స్టేషన్లో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓ లేడీ నిర్మాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యో* పూజ చేస్తానని మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అఘోరీ మోసాన్ని రంగారెడ్డి జిల్లా(Rangareddy district), శంకర్ పల్లి మండలం(Shankarpalli mandal), ప్రొద్దుటూర్ కు చెందిన లేడీ ప్రొడ్యూసర్ బయటపెట్టింది. అఘోరీతో 6 నెలల క్రితం పరిచయం అయినట్లు ఫిర్యాదులో తెలిపింది. పరిచయం అయిన 2 నెలల తర్వాత ప్రొద్దుటూర్ లోని ప్రగతి రిసార్ట్స్(Resorts) కు డిన్నర్ కు వచ్చినట్లు వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేదని చెప్పింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మించడంతో అంగీకరించానని తెలిపింది.
వారం రోజుల్లో పూజ చేద్దామని ఖర్చుల కోసం అడిగితే, అఘోరీ అకౌంట్ లో రూ. 5 లక్షలు వేశానని తెలిపింది. అనంతరం పూజ కోసం ఉజ్జయిని(Ujjain)లోని ఫాం హౌస్(farmhouse)కు తీసుకెళ్లి పూజ చేయించిందని ఫిర్యాదులో పేర్కొంది. మరుసటి రోజు మరో రూ. 5 లక్షలు అమె అకౌంట్(account)లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని అఘోరీ భయపెట్టిందంది. దీంతో మరో రూ.5 లక్షలు అకౌంట్లో వేశానని చెప్పింది. దీన్ని అలుసుగా చేసుకుని అఘోరీ మాతతో పూజ పూర్తి చేసుకున్నావు కనుక, మరో రూ.5 లక్షలు ఇవ్వాలని లేదంటే నిన్ను, నీ కుటుంబాన్ని మంత్ర శక్తులతో అంతం చేస్తానని.. బెదిరించినట్లు ఫిర్యాదులో వివరించింది.