
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump tariffs | సుంకాల(Tariffs) విషయంలో భారత్, అమెరికాల మధ్య సాగుతున్న చర్చలు.. స్టాక్ మార్కెట్లకు stock markets బూస్ట్ ఇస్తున్నాయి. అమెరికాకు US ఎగుమతి చేసే కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. ప్రధానంగా ఆటో, ఫార్మా రంగాల pharma sector స్టాక్స్‌లో జోష్ కనిపిస్తోంది.
Trump tariffs | ఫార్మా రంగం
ఫార్మా(Pharma) కంపెనీలపైనా ప్రతీకార సుంకాలు ఉంటాయన్న ట్రంప్(Trump) ప్రకటనతో మన దేశంనుంచి అమెరికాకు మందులు ఎగుమతి చేసే అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, గ్లాండ్ ఫార్మా వంటి స్టాక్స్ ఇటీవల పతనమయ్యాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య టారిఫ్‌ల tariffs విషయంలో చర్చలు జరుగుతుండడంతో ఆయా కంపెనీలు కోలుకుంటున్నాయి.
Trump tariffs | ఆటోమొబైల్ రంగం
ట్రంప్ టారిఫ్‌లతో Trump tariffs ఎక్కువగా నష్టపోయింది మన ఆటోమొబైల్(Automobile) రంగమే.. టాటామోటార్స్, సోనా బీఎల్‌డబ్ల్యూ, సంవర్ధన మదర్‌సన్ వంటి కంపెనీలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా టాటామోటార్స్(Tata Motors)కు సంబంధించిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్స్ Jaguar Land Rover cars ఎక్కువగా అమెరికాకే ఎగుమతి అవుతాయి. దిగుమతి చేసుకునే వాహనాలు, ఆటో విడిభాగాలపైన అమెరికా టారిఫ్‌ల ఉపశమనం ఇస్తుందన్న వార్తలతో ఆటోమొబైల్ స్టాక్స్ పెరుగుతున్నాయి.
Trump tariffs | మెటల్, స్టీల్ సెక్టార్లు
టారిఫ్‌ల అమలునుంచి తాత్కాలిక ఉపశమనం లభించడంతో మెటల్(Metal), స్టీల్ సెక్టార్లు steel sectors కోలుకుంటున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్ల trading sessions నుంచి టాటా స్టీల్, జేఎల్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో వంటి కంపెనీలు ర్యాలీ చేస్తున్నాయి.
Trump tariffs | బ్యాంకింగ్ సెక్టార్
టారిఫ్‌ల అమలును వాయిదా వేయడంతో postponement ఆర్థిక అనిశ్చితి తగ్గింది. దీంతో బ్యాంకింగ్(Banking) స్టాక్స్ రాణిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు లాభపడుతున్నాయి. సుంకాల విషయంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతుండడం, ఫలించే అవకాశాలు ఉండడంతో మన దేశానికి చెందిన ఎగుమతిదారులకు మరింత మేలు జరిగే అవకాశాలున్నాయి.