అక్షరటుడే, ఇందూరు:Fire Station | వేసవి దృష్ట్యా అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలుంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైల్వే ఎస్సై సాయిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రైల్వేస్టేషన్(Nizamabad Railway Station)లో అగ్నిమాపక వారోత్సవాల(fire safety week) వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్(fire officer) నర్సింగ్‌రావు మాట్లాడుతూ.. ఈనెల14వ తేదీ నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయని.. 20న ముగుస్తాయన్నారు. దీంట్లో భాగంగా ప్రజలకు అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్సై మొగులయ్య, ఏఎస్సై హమీద్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.