Congress Nizamabad | అంబేడ్కర్​ను అవమానించింది బీజేపీనే..: కాంగ్రెస్

Congress Nizamabad | అంబేడ్కర్​ను అవమానించింది బీజేపీనే..
Congress Nizamabad | అంబేడ్కర్​ను అవమానించింది బీజేపీనే..

అక్షరటుడే, ఇందూరు:Congress Nizamabad | అంబేడ్కర్​ను అవమానించింది బీజేపీనేనని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి(DCC President Manala Mohan Reddy) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పూలాంగ్​లో అంబేడ్కర్​ విగ్రహానికి పాలతో శుద్ధి చేశారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు(BJP Leaders) అంబేడ్కర్ విగ్రహాన్ని తాకినందుకు నిరసనగా పాలతో శుద్ధి చేశామన్నారు. దేశంలో పీఎం(PM) నుంచి గ్రామస్థాయి బీజేపీ కార్యకర్త వరకు అంబేడ్కర్​ను అవమానించారన్నారు.  పార్లమెంటులో అమిత్​షా(Amit Shah) అంబేడ్కర్​ గురించి అభ్యంతరక వ్యాఖ్యలు చేస్తే ప్రధాని మోదీ(Prime Minister Modi) మందలించలేదని ఆరోపించారు. దీంతో బీజేపీ(BJP) చిత్తశుద్ధి ఎలాంటిదో అర్థమవుతుందని అన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Fire Department | అగ్నిమాపక కేంద్రంలో కమాండర్ పరేడ్

అనంతరం రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్(Chairman Taher bin) మాట్లాడుతూ.. ప్రజలను బీజేపీ మోసం చేయాలని చూస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంబేడ్కర్​ జయంతి(Ambedkar Jayanti) చేసుకుంటే.. పీఎం పార్లమెంటు(PM Parliamement)లో శ్రద్ధాంజలి ఘటించలేదన్నారు. కార్యక్రమంలో నూడా ఛైర్మన్ కేశవేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, విజయపాల్ రెడ్డి, వినోద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement