అక్షరటుడే, వెబ్‌డెస్క్: SIM card | కొత్త సిమ్ కార్డు new sim Card కొనాలనుకుంటున్నారా.. ఇందుకోసం ఇక మొబైల్ స్టోర్‌కు mobile store వెళ్లాల్సిన పనిలేదు. కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటికే డెలివరీ delivery అవుతుంది.
ఇదేంటి అనుకుంటున్నారా.. దేశంలో క్విక్ కామర్స్ వ్యాపారం quick commerce business కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో కేవలం గ్రోసరీ, వెజిటెబుల్స్ డెలీవరీ delivery ఈ సంస్థలు ప్రస్తుతం తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఎలక్ట్రానిక్, మొబైల్స్ electronics, mobiles తదితర వాటిని కూడా డెలీవరీ చేస్తున్నాయి. ఇప్పడు మరో అడుగు ముందుకు వేసి సిమ్ కార్డులను కూడా 10 నిమిషాల్లో మీ ముంగింట ఉంచుతున్నాయి.
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ quick commerce company బ్లింకిట్ Blinkit తాజాగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కస్టమర్లకు customers కేవలం 10 నిమిషాల్లోని ఎయిర్టెల్ సిమ్‌ను డెలివరీ ఇవ్వనుంది. కాగా.. ఈ సర్వీస్ దేశంలోని 16 ప్రధాన నగరాల్లో అందుబాటు ఉన్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది.
SIM card | రూ. 49 చెల్లించి..
వినియోగదారులు రూ.49 చెల్లించి సిమ్ కార్డును ఆర్డర్ చేయవచ్చు. ఈ నంబరును ఆధార్ కేవైసీ Aadhaar KYC ద్వారా యాక్టివేట్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. బ్లింకిట్ Blinkit సిమ్ డెలివరీ సేవలను SIM delivery services మాత్రమే అందిస్తుందని.. వినియోగదారులు సెల్ఫ్ కేవైసీ పూర్తి చేసి సిమ్ కార్డును యాక్టివేట్ sim card activation చేసుకోవచ్చని వివరించింది. కస్టమర్లు తమ సేవలను సులువుగా అందించేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చామని ఎయిర్ టెల్ పేర్కొంది.