అక్షరటుడే, బాన్సువాడ:School Anniversary | మండలంలోని హన్మాజీపేట(Hanmajipeta)లో సన్రైజ్ పాఠశాల(Sunrise School) వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల(Students) సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే ఇటీవల నిర్వహించిన క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు(Prizes) అందజేశారు.
కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, బాన్సువాడ ట్రస్మా అధ్యక్షుడు పాశం రాజిరెడ్డి, ప్రిన్సిపాల్ లావణ్య, కరస్పాండెంట్ సంతోష్, వేణుగౌడ్, గణేష్, నాగరాజు, నందకుమార్, విఠల్, దీరజ్, సాయిలు, పరంధాములు, విద్యార్థుల తల్లిదండులు తదితరులు పాల్గొన్నారు.