Chandrasekharendra Saraswati University | చిత్తశుద్ధితో విద్యార్థులు అభ్యసించాలి

Chandrasekharendra Saraswati University | చిత్తశుద్ధితో విద్యార్థులు అభ్యసించాలి
Chandrasekharendra Saraswati University | చిత్తశుద్ధితో విద్యార్థులు అభ్యసించాలి

అక్షరటుడే, ఇందూరు:Chandrasekharendra Saraswati University | విద్యార్థులు చిత్తశుద్ధితో విద్యను అభ్యసించాలని చంద్రశేఖరేంద్ర సరస్వతీ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్(Vice Chancellor Srinivas) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గంగస్థాన్(Gangasthan)​లోని ఉత్తర తిరుమల దేవాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులోని కాంచీపురం పుణ్యక్షేత్రంలో 1993 నుంచి విశ్వవిద్యాలయం (University) కొనసాగుతుందన్నారు. విజయేంద్ర సరస్వతి స్వామి(Vijayendra Saraswati Swami) దివ్య సూచనలతో విద్యాలయం ముందుకు సాగుతుందన్నారు. 28 ఏళ్లుగా ఎందరో విద్యార్థులను ఈ విద్యాలయం ఉత్తమంగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. ఇంజనీరింగ్(engineering)​లోని అన్ని విభాగాలు శాస్త్ర సాంకేతిక, మేనేజ్​మెంట్​, వైద్య విజ్ఞాన శాస్త్రంకే కాకుండా వైద్య అనుబంధ సేవా శాస్త్రం కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. న్యాయ శాస్త్రం, ఇతర సాంఘిక సాంస్కృతిక భాషా శాస్త్రంలు డిగ్రీ, పీజీ పరిశోధన స్థాయిలో అందిస్తామన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Dichpally Ashram School | విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

బాల బాలికలకు వేరువేరుగా వసతి గృహాలు, ఆరోగ్యకరమైన శుద్ధ శాకాహారంతో అందిస్తున్నామన్నారు. సుమారు 50 ఎకరాల సువిశాల పచ్చని ప్రశాంత పరిసరాలతో ప్రతి విభాగానికి ప్రత్యేక భవనాలు(Special buildings) ఉన్నాయన్నారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. L ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు.

Advertisement