అక్షరటుడే, వెబ్డెస్క్ : Sunstroke | ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి march ఆరంభం నుంచి భానుడు Sun తన ప్రతాపం చూపుతున్నాడు. ఏప్రిల్ Aprilలో అయితే పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు TEmparature నమోదయ్యాయి. 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
దీంతో ప్రజలకు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అయితే ఏటా వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది మరణిస్తారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం State Govt కీలక ప్రకటన చేసింది. వడదెబ్బ Sunstrokeను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది.
Sunstroke | ఆర్థిక సాయం పెంపు
వడదెబ్బతో మృతి చెందితే గతంలో బాధితుల కుటుంబానికి రూ.50 వేల చొప్పున పరిహారం Compensation అందజేసేవారు. ప్రస్తుతం ఆ పరిహారాన్ని రూ.నాలుగు లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ జేసింది.
Sunstroke | అప్రమత్తంగా ఉండాలి
ఎండలు మండుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వడగాలుల Heat waves ప్రభావం నుంచి రక్షించుకోవడానికి స్థానిక అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఎండలో బయటకు వెళ్లొద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు వడదెబ్బ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.