Ram charan | రామ్ చ‌ర‌ణ్‌తో సందీప్ రెడ్డి వంగా క్రేజీ ప్రాజెక్ట్.. సుకుమార్ త‌ర్వాత ఆయ‌న‌తోనా..!

Ram charan | రామ్ చ‌ర‌ణ్‌తో సందీప్ రెడ్డి వంగా క్రేజీ ప్రాజెక్ట్.. సుకుమార్ త‌ర్వాత ఆయ‌న‌తోనా..!
Ram charan | రామ్ చ‌ర‌ణ్‌తో సందీప్ రెడ్డి వంగా క్రేజీ ప్రాజెక్ట్.. సుకుమార్ త‌ర్వాత ఆయ‌న‌తోనా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ram charan | మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు Buchi Babu దర్శకత్వంలో ‘పెద్ది’ ‘Peddhi’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల ఈ చిత్రం నుండి గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు huge expectations పెంచింది.

Advertisement
Advertisement

ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత సుకుమార్ Sukumar డైరెక్షన్లో ఓ సినిమా చేయ‌నున్నాడు. త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ఏ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌నున్నాడు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. లోకేష్ కనగరాజ్ Lokesh Kanagaraj, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా Sandeep Reddy Vanga వంటి దర్శకులతో చరణ్ సినిమాలు చేసే అవకాశముందని వార్తలు వినిపించాయి.

Ram charan | ఇది జ‌రిగితే అద్భుతం..

‘యానిమల్’తో Animal ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా మారిన సందీప్ రెడ్డితో రామ్ చ‌ర‌ణ్ Ram Cahran 18వ సినిమా ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సందీప్ చేతిలో ప్రభాస్ ‘స్పిరిట్’ Spirit, రణబీర్ కపూర్ Ranbir Kapoor ‘యానిమల్ పార్క్ animal park’ ఉన్నాయి. వీటితో పాటు, అల్లు అర్జున్ తోనూ Allu Arjun ఒక సినిమా కమిటై ఉన్నాడు. బన్నీ-సందీప్ కలయికలో రెండేళ్ల క్రితం టీ-సిరీస్ T-Series ఒక భారీ సినిమాని ప్రకటించిన దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేవు. దీంతో అసలు ఈ మూవీ పట్టాలెక్కుతుందా..? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  allu arjun | ప‌వ‌న్ కళ్యాణ్‌- అల్లు అర్జున్ మీటింగ్‌ని ఎందుకంత సీక్రెట్‌గా ఉంచుతున్నారు.. అస‌లు ఏం జ‌రిగింది?

ఇప్పుడు అల్లు అర్జున్ Allu Arjun స్థానంలో రామ్ చరణ్ Ram Charan ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం . అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను అట్లీ, త్రివిక్రమ్ తో Atlee and Trivikram చేయనున్నాడు. ఆ తర్వాత పుష్ప-3 Pushpa 3 చేయాల్సి ఉంది. ఇవి పూర్తి కావడానికి కనీసం మూడు నాలుగేళ్లు ప‌డుతుంది. కాబ‌ట్టి సందీప్ రెడ్డి.. రామ్ చ‌ర‌ణ్ తో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే.. పెద్ది, సుకుమార్ ప్రాజెక్ట్ Peddi and Sukumar projects తర్వాత చరణ్ చేయబోయే సినిమా సందీప్ రెడ్డితోనే Sandeep Reddy ఉండే అవకాశముంది అంటున్నారు. ‘యానిమల్’ తరహాలో ఒక బోల్డ్ క్యారెక్టరైజేషన్‌లో చరణ్ కనిపిస్తే అది ఫ్యాన్స్‌కు గొప్ప విజువల్ ట్రీట్ అవుతుంది.

Advertisement