అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలో నిర్వహించే ఊర పండుగ విషయంలో కోటగల్లిలోని సిర్నాపల్లి గడిలో ఆదివారం జరిగిన సర్వసమాజ్ కమిటీ పెద్దలు, ఇతర కుల సంఘాల మధ్య సమావేశం రసాభాసగా మారింది. ప్రతి ఊరపండుగ విషయంలో కొన్ని కుల సంఘాలకే సర్వసమాజ్ కమిటీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారని సమావేశంలో చర్చకు వచ్చింది. మిగతా సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కమిటీ పెద్దల ముందే ఆయా కుల సంఘాల ప్రతినిధులు విమర్శలు చేసుకున్నారు. మాటమాట పెరిగి సమావేశం రసాభాసగా మారింది. దీంతో సర్వసమాజ్ కమిటీ పెద్దలు సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించి వెళ్లిపోయారు.