Jairam Ramesh | మోదీవి ప్రతీకార రాజకీయాలు.. ఈడీ చర్యపై స్పందించిన కాంగ్రెస్

Jairam Ramesh | మోదీవి ప్రతీకార రాజకీయాలు.. ఈడీ చార్జిషీట్పై స్పందించిన కాంగ్రెస్
Jairam Ramesh | మోదీవి ప్రతీకార రాజకీయాలు.. ఈడీ చార్జిషీట్పై స్పందించిన కాంగ్రెస్

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Jairam Ramesh | నేషనల్ హెరాల్డ్ National Herald మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ Congress అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై Sonia Gandhi and Rahul Gandhi ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ Enforcement Directorate (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్ పై కాంగ్రెస్ మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi కుట్ర ఉందని ఆరోపించింది. మోదీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైనా ఆయన ఆరోపణలు చేశారు. హోం మంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Jairam Ramesh | బీజేపీవి ప్రతీకార రాజకీయాలు..

మోదీ, అమిత్ షా Modi and Amit Shah ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని జైరాం రమేశ్ Jairam Ramesh వ్యాఖ్యానించారు. ” చట్టాల పేరు చెప్పి నేషనల్ హెరాల్డ్ National Herald ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వ ప్రాయోజిత నేరం. ప్రధానమంత్రి Prime Minister, హోంమంత్రి Home Minister ప్రతీకార రాజకీయాలు, బెదిరింపులకు నిదర్శనమే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరిపై చార్జిషీట్లు దాఖలు చేయడం. ఇలాంటి బెదిరింపులు కాంగ్రెస్ పార్టీ నోటిని మూయలేవు. సత్యమేవ జయతే” అని జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ ఛార్జ్​షీట్​.. రాహుల్​, సోనియా పేర్లు

Jairam Ramesh | సోనియా, రాహుల్ పై ఈడీ చార్జ్ షీట్

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో National Herald money laundering case కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై ఈడీ మంగళవారం చార్జ్ షీట్ దాఖలు చేసింది. వీరితో పాటు కాంగ్రెస్ నాయకుడు Congress leaders శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబే పేర్లు కూడా చార్జ్ షీట్ లో ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి అక్రమాలు జరిగాయని పేర్కొంటూ బీజేపీ సీనియర్ నేత senior BJP leader సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ జరిగినట్లు పేర్కొన్న ఈడీ.. ఇటీవలే రూ.691 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. తాజాగా మంగళవారం చార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై ఏప్రిల్ 25న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది.

Advertisement