అక్షరటుడే, వెబ్‌డెస్క్: Viral Video : రన్నింగ్ రైలుతో పోటీపడటం సినిమా(movies)ల్లో చూస్తుంటాం. హీరో చేసే స్టంట్లు(stunts) ప్రేక్షకులను అలరిస్తుంటాయి. నిజ జీవితంలో అలా చేయడం ఒక రకంగా అసాధ్యమనే చెప్పాలి. కానీ, ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయి రీల్స్ కోసం అలాంటి స్టంటే చేసింది. ఎక్స్ ప్రెస్ రైలుతో పోటీ పడుతూ పరిగెత్తింది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు(Netizens) భిన్నంగా స్పందిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో 18.3K ఫాలోవర్స్ తో ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్(fitness influencer)గా పేరొందిన పికు సింగ్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్(Shatabdi Express) (న్యూ ఢిల్లీ నుంచి కల్కా)(New Delhi to Kalka) ప్రయాణిస్తున్నప్పుడు రెండు రైల్వే ట్రాక్‌ల మధ్య పరిగెడుతూ రీల్‌ను చిత్రీకరించింది. రెండు రైలు పట్టాల నడుమ ఆమె తన శక్తినంతా వినియోగించి పరిగెత్తడంతో రీల్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే, ఆమెకు ఎడమ వైపు నుంచి ఒక రైలు రావడంతో.. దానితో ఆమె పోటీగా పరుగెడుతుంది. ఆమె రైలు వేగంతో పోటీ పడుతూ పరిగెడుతున్నట్లుగా వీడియోలో ఉంది.
పికు సింగ్(Piku Singh) తన ఈ పరుగు రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. ప్రమాదకరమైన స్టంట్‌ను ఖండిస్తూ ఇది ప్రాణాంతకమని హెచ్చరించారు. “మర్ జాయేగి లడ్కీ, వ్యూస్ కే లియే అయిసా మత్ కరో (నువ్వు చనిపోతావు అమ్మాయి. వ్యూస్ కోసం ఇలా చేయకు)” అని ఓ నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు. మరికొంత మంది నెటిజన్లు ఆమె రన్, ఫిట్‌నెస్‌ను ప్రశంసించారు. “మంచి ప్రయత్నం” అని కామెంట్ పెట్టారు.
రీల్ కోసం సాహసం.. కావొద్దు ప్రాణాంతకం#fitness #viralvideo #socialmedia #viral pic.twitter.com/zljhMVhnvj
— Akshara Today (@aksharatoday) April 15, 2025