Central Government : పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్రం.. ముందు మీ రికార్డు చూసుకోవాలని హితవు

Central Government : పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్రం.. ముందు మీ రికార్డు చూసుకోవాలని హితవు
Central Government : పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్రం.. ముందు మీ రికార్డు చూసుకోవాలని హితవు

అక్షర టుడే, వెబ్ డెస్క్ Central Government : వక్ఫ్ (సవరణ) చట్టంపై (Waqf Amendment) పాకిస్తాన్ (Pakistan) చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం (Central Government) తిప్పికొట్టింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఇస్లామాబాద్​కు లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇతరులకు సుద్దులు చెప్పే ముందు పాకిస్తాన్ తన గత చరిత్రను చూసుకోవాలని హితవు పలికింది. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం (Waqf Amendment Act) గురించి పొరుగు దేశం స్పందించింది.

Advertisement

ముస్లింల మసీదులు, పుణ్యక్షేత్రాలు సహా వారి ఆస్తులను లాక్కునేందుకు, మైనార్టీలను అణగదొక్కేందుకే వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చారని వ్యాఖ్యానించింది. పాక్ ఆరోపణలను విదేశాంగ శాఖ తప్పుబట్టింది. తమ అంతర్గత విషయాలపై మాట్లాడేందుకు పాకిస్తాన్​కు (Pakistan) హక్కు లేదని పేర్కొంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Waqf act | వక్ఫ్​ సవరణ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు

Central Government : పాక్ వ్యాఖ్యలు నిరాధారం

కొత్త వక్ఫ్ చట్టంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, అవి ప్రేరేపితమైవని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మైనార్టీల హక్కులను కాపాడే విషయంలో పాకిస్తాన్ (Pakistan) ఇతరులకు బోధించే బదులు తన దారుణమైన రికార్డును పరిశీలించడం మంచిదని హితవు పలికారు. “భారత పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్తాన్ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్​కు ఎటువంటి హక్కు లేదు. మైనారిటీల హక్కులను కాపాడే విషయంలో పాకిస్తాన్ ఇతరులకు బోధించే బదులు దాని స్వంత దారుణమైన రికార్డును పరిశీలించడం మంచిది” అని రణధీర్ జైస్వాల్ అన్నారు.

Advertisement