అక్షరటుడే, వెబ్‌డెస్క్: Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టినప్పటి నుంచి వలసల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం key decision తీసుకున్నారు. అక్రమంగా ఉంటూ స్వీయబహిష్కరణ (self-deportation) చేసుకోవాలనుకునే వారికి స్పెషల్ ఆఫర్ ప్రకటించారు.
వారికి విమాన ఖర్చులతో flight expenses పాటు కొంత నగదు అందిస్తామని వెల్లడించారు. ఓ వార్తా సంస్థకు news agency ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విధంగా వెల్లడించారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇమిగ్రేషన్ అధికారులు immigration officials దృష్టి సారించారని ట్రంప్ తెలిపారు. చట్టవిరుద్ధంగా ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయబహిష్కరణ కార్యక్రమం self-deportation program చేపట్టినట్లు పేర్కొన్నారు. అలా వెళ్లాలనుకునే వారికి తాము విమాన ఖర్చులతో flight expenses పాటు కొంత నగదును అందిస్తామన్నారు.
వెళ్లిపోయినవారిలో మంచివారు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడం విషయంలోనూ ట్రంప్ Trump మాట్లాడారు. అక్రమ వలసదారులను illegal immigrants దేశం నుంచి వెళ్లగొట్టడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, సముచితమని భావిస్తే వారిని చట్టపద్ధతిలో తిరిగి అనుమతిస్తామన్నారు.