అక్షరటుడే, వెబ్డెస్క్ : Group-1 Exam | గ్రూప్–1 పరీక్షలో పెద్ద స్కామ్ big scam జరిగిందని ఇటీవల బీఆర్ఎస్ నాయకులతో BRS leaders పాటు పలువురు అభ్యర్థులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా టీఎస్పీఎస్సీ TSPSC స్పందించింది. గ్రూప్–1లో విజయం సాధించని కొందరు అభ్యర్థులు, కోచింగ్ సెంటర్ల coaching centers నిర్వాహకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరింది. నిబంధనల మేరకు నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించింది.
Advertisement
Advertisement