అక్షరటుడే, వెబ్‌డెస్క్: IREDA | ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ Indian Renewable Energy Development Agency(IREDA).. ఫలితాల్లో అదరగొట్టింది. పనితీరులో బలమైన వృద్ధిని సాధించడంతో వార్షిక లాభాలు ఏకంగా 49 శాతం పెరిగాయి. దీంతో ఈ స్టాక్(Stock) ధర రెండు రోజుల్లోనే 12 శాతానికిపైగా పెరిగింది. ఐఆర్‌ఈడీఏ మంగళవారం ఫలితాలను ప్రకటించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్(QOQ)తోపాటు ఈయర్ ఆన్ ఈయర్(YOY) లాభాలలోనూ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.
IREDA | నెట్ ప్రాఫిట్:
2023-24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే నికర లాభం(Net profit) 48.7 శాతం పెరిగింది. నికర లాభం రూ. 337 కోట్లనుంచి రూ. 501 కోట్లకు చేరింది. క్వార్టర్ ఫలితాల్లోనూ వృద్ధి నమోదయ్యింది. 2024-25 డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌తో పోల్చితే మార్చితో ముగిసిన త్రైమాసికం(Quarter)లో 18 శాతం పెరుగుదల కనిపించింది.
IREDA | రెవెన్యూ:
ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ(Revenue) 37.7 శాతం పెరిగింది. 2023-24లో రూ. 1,392 కోట్లు ఉన్న రెవెన్యూ.. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ. 1,916 కోట్లకు పెరిగింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే 40 శాతం వృద్ధి నమోదయ్యింది.
IREDA | అసెట్ క్వాలిటీ
అసెట్ క్వాలిటీ(Asset quality) కూడా పెరిగింది. గత త్రైమాసికంలో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(GNPA) 2.68 శాతం ఉండగా.. ఈసారి 2.45కు తగ్గింది. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(NNPA) 1.50 శాతంనుంచి 1.35 శాతానికి పరిమితమయ్యింది.
IREDA | రుణాలు:
రుణాల మంజూరు(Loan sanction)లోనూ గణనీయమైన ప్రగతిని సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 37,354 కోట్ల రుణాలు మంజూరు చేయగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 47,453 కోట్ల రుణాలను మంజూరు చేసి, 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. రుణాల పంపిణీ(Loan disbursement)లోనూ 20 శాతం ప్రగతి కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,089 కోట్ల రుణాలివ్వగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 30,168 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. ఐఆర్‌ఈడీఏ మొత్తం లోన్ బుక్(Loan book) రూ. 76,250 కోట్లకు చేరింది.
IREDA | స్టాక్ ధరలో మార్పులు..
ఐఆర్‌ఈడీఏ మంచి ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలతో స్టాక్ ప్రైస్(Stock price) మంగళవారమే 8 శాతానికిపైగా పెరిగింది. బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 4.5 శాతం లాభంతో కొనసాగుతోంది. కాగా 52 వారాల గరిష్ట ధర రూ. 310 కాగా.. కనిష్ట ధర 137. ఈ స్టాక్ ఒక నెలలో దాదాపు 30 శాతం, రెండు రోజులలోనే 12 శాతం పెరుగుదలను నమోదు చేసింది.