అక్షరటుడే, బిచ్కుంద:Bichkunda | పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి ఓ విద్యార్థిని(student)కి గాయాలైన ఘటన బిచ్కుందలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం (Bichkunda Mandal) దౌల్తాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉదయం తరగతిలో చదువుకుంటున్న విద్యార్థులపై పైకప్పు పెచ్చులూడి పడగా పలువురికి గాయాలయ్యాయి.
దీంతో ఆ విద్యార్థినికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల వివరణ కోరగా.. తరగతి గదుల్లో పెచ్చులూడిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.
Bichkunda | శిథిలావస్థలో పాఠశాల భవనం
గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల(Elementary school) శిథిలావస్థకు చేరింది. ఈ విషయమై పలుసార్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు సమాచారం అందించామని వారు పేర్కొంటున్నారు. గదులు శిథిలావస్థకు చేరుకున్నందున విద్యార్థులను(Students) ఆరుబయట కూర్చోబెట్టాలని కూడా సూచించామని చెబుతున్నారు.
Bichkunda | కొత్త భవనం నిర్మించాలి
పాఠశాల భవనం(School building) పూర్తిగా పాడైపోయింది. అందుకే తరగతి గదుల్లో విద్యార్థులను కూర్చోబెట్టకూడదని పలుమార్లు ఉపాధ్యాయులకు సైతం సూచించాం. మంగళవారం ఇద్దరు విద్యార్థినులకు పైకప్పు పెచ్చూలుడి గాయాలయ్యాయి. వెంటనే కొత్త భవనం నిర్మించాలి.
