అక్షరటుడే,కోటగిరి :Kotagiri | గన్నీబ్యాగులు, హమాలీల కొరతను పట్టించుకోవట్లేదని నిరసిస్తూ సహకారం సంఘం(Cooperative Building) భవనానికి రైతులు తాళం వేశారు. ఈ ఘటన కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.
రైతులు(Farmers) తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నిరోజులుగా ఎత్తొండ సహకారం సంఘంలో గన్నీ సంచుల కొరత ఉంది. రైతులు ఈ విషయాన్ని సిబ్బందికి చెప్పినా పట్టించుకోవట్లేదు. ఒకవైపు పంట ఆరబోస్తే.. ఎప్పుడు వర్షాలు పడతాయో.. అనే ఆందోళనలో అన్నదాతలు గందరగళంలో ఉన్నారు.
మరోవైపు హమాలీలు లేక పనులు నిలిచిపోతున్నాయని సమాచారం ఇచ్చినప్పటికీ.. పట్టించుకోలేదని రైతులు వాపోయారు. దీంతో బుధవారం సహకారం సంఘం భవనానికి తాళం వేసి నిరసన తెలిపారు. వెంటనే హామాలీలు, గన్నీ సంచుల కొరత తీర్చాలని వారు డిమాండ్ చేశారు.