Gold price | వామ్మో ఇక బంగారం కొనగలమా..? తులం ధర రూ.లక్ష దాటనుందట..!

Gold Price | మళ్లీ కాస్త హైక్​..ఈ రోజు పసిడి ధర ఎంతంటే..
Gold Price | మళ్లీ కాస్త హైక్​..ఈ రోజు పసిడి ధర ఎంతంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold price | పసిడి ధరలు పరుగులు gold rates పెడుతూనే ఉన్నాయి. ట్రంప్​ టారిఫ్​ ఎఫెక్ట్​తో గత కొన్నిరోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గ్లోబర్​ స్టాక్​ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు పుత్తడి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు సైతం బంగారం కొనుగోలు చేస్తుండడంతో రేటు బాగా పెరుగుతోంది.

Advertisement

రెండు నెలల క్రితం వరకు తులం రూ.80 వేలుగా ఉన్న ధర ప్రస్తుతం రూ.లక్షకు చేరువైంది. కాగా.. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ goldman Sachs పసిడి ప్రియులకు షాక్​ లాంటి వార్త చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి సుమారు రూ.1.25 లక్షలకు చేరువ కావొచ్చని అంచనా వేస్తోంది.

Gold price | మాంద్యం భయాల నేపథ్యంలో..

పసిడికి ఊహించని స్థాయిలో కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్ gold demand పెరుగుతోంది. మాంద్యం భయాల కారణంగా దేశాలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో గోల్డ్​ రేటు gold prices కొత్త శిఖరాలను చేరుకుంటోందని గోల్డ్ మన్ సాచ్స్ చెప్పినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Stock market | మిక్స్‌డ్‌గా అంతర్జాతీయ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Gold price | 2025లో 23 శాతం అప్​

బంగారం ధరలు ఈ ఏడాది ఇప్పటివరకు 23 శాతానికి పైగా పెరిగాయి. కాగా.. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు central banks నెలకు సగటున 80 టన్నుల బంగారం కొనుగోలు చేస్తాయని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేస్తోంది. గతంలో 70 టన్నుల కన్నా ఇది ఎంతో అధికంగా చెప్పవచ్చు. అయితే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు నెలకు 100 టన్నులకు పెరిగినట్లయితే.. 2025 చివరి నాటికి ఔన్సు 3,810 డాలర్లకు చేరే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఒకవేళ మాంద్యం వస్తే కరోనా సమయంలోని గరిష్ఠ స్థాయి నిధుల ఇన్ ఫ్లోను చూసినట్లే.. గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయని తెలిపింది. అప్పుడు ఔన్సు ధర 3,880 డాలర్లకు కూడా చేరుకోవచ్చని పేర్కొంది. అయితే బలమైన ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయంగా అనిశ్చిత తగ్గితే మాత్రం గోల్డ్ ర్యాలీకి బ్రేకులు పడవచ్చని పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి ఔన్సు గోల్డ్ 3,550 డాలర్ల వద్ద స్థిరపడవచ్చని తెలిపింది.

Advertisement