Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | రాష్ట్రంలో ఇళ్లు లేని పేదల కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని Indiramma Housing Scheme ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. తాము అధికారంలోకి వస్తే పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ Congress​ ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రజాపాలన Praja Palanaలో భాగంగా ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు స్వీకరించింది.

Advertisement

Indiramma Houses | ఇంటింటి సర్వే

ప్రజాపాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడానికి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల సర్వే indiramma survey నిర్వహించారు. ప్రత్యేక యాప్​లో దరఖాస్తుదారుల వివరాలు పొందుపరిచారు. జనవరి 26న ఇందిరమ్మ ఇళ పథకాన్ని సీఎం రేవంత్​రెడ్డి CM Revanth Reddy ప్రారంభించారు. దరఖాస్తుదారులను వివిధ కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరిలో సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న అత్యంత పేదవారికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Indiramma Houses | గ్రామాల్లో జాబితా ప్రదర్శన

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల indiramma illu Beneficiaries ఎంపిక కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనుంది. ఇందుకోసం 23 రోజుల కార్యాచరణ సిద్ధం చేసింది. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యాచరణలో భాగంగా అధికారులు ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలో మొదట నిర్ణయిస్తారు. అనంతరం ఇందిరమ్మ కమిటీలు Indiramma Committees లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Bhu Bharati | రైతుల పాలిట శాపం ‘ధరణి’

ఏప్రిల్​ 22 నంచి 30 వరకు కమిటీలు సూచించిన లబ్ధిదారుల జాబితాను అధికారులు పరిశీలిస్తారు. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే తొలగిస్తారు. అనంతరం మే 1న లబ్ధిదారుల జాబితాను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. మే 2 నుంచి 4 వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ జాబితాపై తుది పరిశీలన చేపడుతారు. అనంతరం అర్హులకు మే 5 నుంచి 7 వరకు అధికారులు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ పత్రాలు వచ్చిన వారు ఇళ్లు నిర్మించుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది.

Indiramma Houses | దశల వారీగా సాయం

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం విడతల వారీగా ఆర్థిక సాయం చేయనుంది. బేస్​మెంట్ వరకు నిర్మాణం పూర్తియితే రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం పలువురి ఖాతాల్లో నగదు జమ చేసింది. గోడలు పూర్తయ్యాక రూ.1.25 లక్షలు, స్లాబ్​ తర్వాత రూ.1.75 లక్షలు, ఇళ్లు మొత్తం అయ్యాక రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

Advertisement