అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశంలో ఉగ్రవాదుల చొరబాట్లు ఆగడం లేదు. తాజాగా దేశంలో అక్రమంగా చొరబడేందుకు టెర్రరిస్టులు యత్నిస్తుండగా భద్రతా బలగాలు అడ్డుపడడంతో కాల్పులకు తెగబడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గల దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సైనికులతో కలిసి సోమవారం రాత్రి తనిఖీలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం రాత్రి భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఓ అధికారి సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు కూడా గాయాలపాలైనట్లు సమాచారం.