అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vaibhav Suryavanshi : ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు చెందిన వైభవ్ సూర్యవంశీ, లీగ్‌లో ఆడిన అతి చిన్న వయస్కుడిగా చరిత్రలో నిలిచాడు. కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు వైభవ్ సూర్యవంశీ.
Vaibhav Suryavanshi : వేలంలోనే రికార్డు..
నిజానికి ఐపీఎల్ 2025(IPL 2025) మెగా వేలం(mega auction)లోనే వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 13 ఏళ్ల వయసులోనే వేలంలో నిలబడ్డాడు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో లాంటి ఆటగాళ్లే అన్‌సోల్డ్‌గా మిగిలిన ఈ వేలంలో సూర్యవంశీకి మాత్రం భారీ డిమాండ్ ఏర్పడింది. అతడి కోసం ఫ్రాంఛైజీలు తెగ పోటీపడ్డాయి. కేవలం రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు దక్కించుకుంది.
Vaibhav Suryavanshi : నాలుగేళ్ల వయసులోనే…
బీహార్‌లోని తాజ్‌పూర్ గ్రామంలో 2011లో సూర్యవంశీ జన్మించాడు. మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు(Indian cricket team) వన్డే ప్రపంచకప్(ODI World Cup) విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయస్సు కేవలం 5 రోజులు మాత్రమే. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయినప్పటికీ వైభవ్ ఇంకా పుట్టనేలేదు. అంటే ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్లకు జన్మించాడు. సూర్యవంశీ తండ్రి రైతు. నాలుగేళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ బ్యాట్ పట్టాడు. తండ్రి సంజీవ్ అతడి కోసం ప్రత్యేకంగా మైదానం చేయించారు.
Vaibhav Suryavanshi : వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా..
పదేళ్లు కూడా నిండకుండానే వైభవ్ అండర్-16 జట్టులోకి వచ్చేశాడు. ఈ ఏడాది చెన్నైలో ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన భారత్ అండర్-19 యూత్ టెస్టులో.. 62 బంతుల్లో 104 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచం చూపును తన వైపునకు మరల్చుకున్నాడు. అండర్-19 టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ కొట్టిన భారతీయుడిగా వైభవ్ నిలిచాడు.
కాగా.. వైభవ్ కంటే ముందు అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా ప్రయాస్ రే బర్మన్(Prayas Ray Burman) ఉన్నాడు. 2019 సీజన్‌లో ఆర్సీబీ తరఫున 16 ఏళ్ల 157 రోజుల వయసులోనే ప్రయాస్ రే తొలి మ్యాచ్ ఆడాడు.