అక్షరటుడే, బోధన్: నియోజకవర్గంలోని ఎడపల్లి మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ బుధవారం ఎడపల్లి మండలం సాటాపూర్ గేటు వద్ద ప్రచారానికి వెళ్లగా.. ఆయన్ను స్థానికులు అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావొద్దని నినాదాలు చేశారు. వీరికి కాంగ్రెస్ నాయకులు తోడయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ జడ్పీటీసీతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.