అక్షరటుడే, ఆర్మూర్‌: పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలూరులో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో దాడి చేసి ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఆరు సెల్‌ఫోన్లు, రూ.19,390 నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది లక్ష్మన్న, రాములు, అనిల్‌ కుమార్, నర్సన్న, ఆజాం ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై అంజమ్మ తెలిపారు.