అక్షరటుడే, వెబ్‌డెస్క్ Hindu Temple : వంద కాదు రెండు వందలు కాదు.. ఏకంగా 3 వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాన్ని తాజాగా కనుగొన్నారు. అది కూడా ఎక్కడో తెలుసా? ముస్లింలు (Muslims )అధికంగా ఉన్న దేశంలో.. ముస్లిం ప్రాబల్యం ఉన్న (Egypt) ఈజిప్ట్ దేశంలో మూడు వేల ఏళ్ల నాటి గుడిని గుర్తించడంతో మరోసారి విగ్రహారాధనపై చర్చ నడుస్తోంది. ఆ ఆలయంలో ఇప్పటికీ కొన్ని విగ్రహాలు, బంగారం ఉన్నాయట. తవ్వకాల్లో భారీ నిధి బయటపడినట్టు తెలుస్తోంది.
(Egypt) ఈజిప్ట్ లోని కర్నాక్ (Karnak)అనే ప్రాంతంలో ఉన్న అతి పురాతనమైన ఆలయంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. ఆ తవ్వకాల్లో బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. దేవతల విగ్రహాలు కూడా తవ్వకాల్లో బయటపడినట్టు తెలుస్తోంది. ఈజిప్ట్ (Egypt) అనగానే మనకు ఈజిప్ట్ పిరమిడ్స్, మమ్మీలు గుర్తుకువస్తాయి. అలాగే.. కొన్ని వేల ఏళ్ల చరిత్ర కూడా ఈజిప్ట్ సొంతం.
3000 Years Old Temple : మూడు వేల ఏళ్ల క్రితమే విగ్రహారాధన
తవ్వకాల్లో బయటపడ్డ నిధి, విగ్రహాలను బట్టి చూస్తూ సుమారు మూడు వేల ఏళ్ల క్రితమే ప్రజలు విగ్రహారాధన చేసేవారని తెలుస్తోంది. ఆ విగ్రహాలు కూడా ఈజిప్ట్ కు చెందిన దేవుళ్ల విగ్రహాలుగా గుర్తించారు. కర్నాక్ టెంపుల్ చాలా పురాతనమైనది. ఎన్నో సాంస్కృతిక, సంప్రదాయాలు, చరిత్రకు అది ఒక గుర్తింపుగా ఉంది. అది పురాతన ఆలయం కావడంతో దాన్ని కాపాడుకునేందుకు (Egyptian government) ఈజిప్ట్ ప్రభుత్వం చాలాసార్లు దాన్ని పునరుద్ధరించింది. దాని చుట్టు పక్కన మాత్రం ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం దొరుకుతుందనే భావనతో తవ్వకాలు జరుపుతూ ఉంటారు. అలా మరోసారి ఈ ఆలయం వద్ద భారీగా నిధి దొరకడంతో ఈ ఆలయం వార్తల్లోకెక్కింది.